నేడు కోల్‌కతాతో హైదరాబాద్ ఢీ
చెన్నై: ఐపీఎల్ సమరానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సిద్ధమైంది. 14వ సీజన్లో తమ తొలి మ్యాచ్‌లో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చెన్నై వేదికగా వార్నర్‌సేన ఢీకొట్టనుంది. నిలకడైన ప్రదర్శనతో మూడేండ్లుగా ప్లేఆఫ్స్ చేరుతున్న ఎస్ఆర్హెచ్ ఈసారి శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి జట్టులోకి రావడంతో వార్నర్‌సేన మరింత బలోపేతమైంది. అతడితో పాటు రషీద్ ఖాన్, నటరాజన్, సందీప్ శర్మతో కూడిన బౌలింగ్ విభాగమే హైదరాబాద్ ప్రధానబలం. అలాగే కెప్టెన్ వార్నర్, బెయిర్‌స్టో, విలియమ్సన్, మనీశ్ పాండేతో పాటు యువ ప్లేయర్ అబ్దుల్ సమద్‌తో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పటిష్టంగానే ఉన్నా.. గతేడాది చెన్నై తరఫున తీవ్రంగా విఫలమైన కేదార్ జాదవ్ ఎలా ఆడుతాడన్నదే చూడాలి. మరోవైపు ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ అందించిన ఇయాన్ మోర్గాన్ ఈ సీజన్లో పూర్తిస్థాయిలో కోల్‌కతాను ముందుకు నడిపించనున్నాడు. అన్ని విభాగాల్లో కేకేఆర్ బలంగా కనిపిస్తున్నా.. ఆ జట్టుపై భారీ అంచనాలుమాత్రం లేవు.
తుదిజట్లు (అంచనా):
హైదరాబాద్: వార్నర్ (కెప్టెన్), బెయిర్‌స్టో, మనీశ్, విలియమ్సన్, విజయ్ శంకర్/ అభిషేక్ శర్మ, కేదార్, సమద్, రషీద్, భువనేశ్వర్, సందీప్, నటరాజన్
కోల్‌కతా: గిల్, రాహుల్ త్రిపాఠి / వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్, అండ్రీ రసెల్, సునీల్ నరేన్/ షకీబ్, కమిన్స్, శివమ్ మావి / హర్భజన్, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి