IPL 2025 : ఐపీఎల్ 118వ సీజన్లో అట్టుడుగున ఉన్నసన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కీలక పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన హైదరాబాద్ ఈసారి విక్టరీపై కన్నేసింది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
చావోరేవో పోరులో కమిన్స్ బృందం ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. కమిందు మెండిస్ స్థానంలో మలింగ ఆడనున్నాడు. పంజాబ్ మాత్రం ఏ మార్పులు లేకుండా ఆడనుంది. రికార్డులు చూస్తే.. 23 మ్యాచుల్లో సన్‌రైజర్స్ 16 విజయాలతో పంజాబ్‌పై ఆధిపత్యం చెలాయించింది. కానీ, ఈసారి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ పటిష్టంగా ఉంది.
🚨 News from Hyderabad 🚨@PunjabKingsIPL elected to bat against @SunRisers in Match 2⃣7⃣
Updates ▶️ https://t.co/RTe7RlXDRq #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/4wdG7f9eaE
— IndianPremierLeague (@IPL) April 12, 2025
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, షమీ, ఈషన్ మలింగ.
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నేహల్ వధేర, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో యాన్సెస్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, చాహల్.