మహిల్పూర్: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ(ఎస్‌డీఎఫ్‌సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి టీమ్ 1-0 తేడాతో ఢిల్లీ ఎఫ్‌సీపై అద్భుత విజయం సాధించింది. ఈ సీజన్లో ప్రత్యర్థి వేదికలపై శ్రీనిధికి ఇది నాలుగో గెలుపు కావడం విశేషం.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టెండా మునోజ్(62ని) ఏకైక గోల్ చేశాడు. ఎస్‌డీఎఫ్‌సీ మూడు మార్పులతో బరిలోకి దిగడం కలిసొచ్చింది.