లాగొస్ (నైజీరియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ ఈవెంట్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ శ్రీజ ఆకుల సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్యాడ్లర్‌గా రికార్డులకెక్కింది. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీజ 4-1 (10-12, 11-9, 11-6, 11-8, 11-6)తో చైనా యువ సంచలనం డింగ్ యిజిపై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. ఇదే టోర్నీ మహిళల డబుల్స్‌లోనూ శ్రీజ-అర్చన ద్వయం 3-0తో భారత్‌కే చెందిన దియా-యశస్విని జంటపై గెలిచి విజేతగా నిలిచారు. పురుషుల డబుల్స్ ఫైన్సల్‌లో మానవ్ ఠక్కర్-హర్మీత్ దేశాయ్ ద్వయం 3-0 (11-8, 11-9, 11-8)తో ఒమొటయొ-సొలంకె (నైజీరియ) జోడీపై గెలిచింది.