Indian Womens Hocky : ఎఫ్ఐహెచ్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ (FIH Hocky Junior World Cup) మరో పది రోజుల్లో మొదలవ్వనుంది. ఈ మెగా టోర్నీ కోసం భారత బృందం చిలీకి బయల్దేరనుంది. ఈ సమయంలో ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. జూనియర్ హాకీ జట్టు కోచ్‌పై ఒక క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలసింది. ఈ విషయం తెలియడంతో కేంద్ర క్రీడా శాఖ విచారణకు ఆదేశించింది. అయితే.. ఈ సంఘటన జరిగి చాలా రోజులే అయిందని.. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఆలస్యంగా క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే.. భారత మహిళల జూనియర్ హాకీ జట్టు ఈ ఏడాది పలు విదేశీ టూర్లకు వెళ్లింది. జూన్‌లో అర్జెంటీనా, బెల్జియం, నెదర్లాండ్స్, సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ఆడింది. అయితే.. ఈ సమయంలోనే ఒక ప్లేయర్ కోచ్ గదికి పలుమార్లు వెళ్లింది. ఈ విషయం స్క్వాడ్‌లోని ఇతర అమ్మాయిలకు కూడా తెలుసు. కానీ, ఎవరూ కూడా ఈ విషయాన్ని హాకీ ఇండియా లేదా కేంద్ర క్రీడా మంత్రి దృష్టికి తీసుకురాలేదు. ఎలాగోలా ఈ విషయం చివరకు కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయ చెవిన పడింది. దాంతో.. అతడు వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
𝐓𝐇𝐄 𝐑𝐈𝐒𝐄 𝐎𝐅 𝐀 𝐆𝐀𝐌𝐄-𝐂𝐇𝐀𝐍𝐆𝐄𝐑!🏑
Once a promising junior talent, now a fearless performer on the world stage — Lalremsiami continues to inspire the next generation of Indian hockey stars.
Let’s cheer our rising champions as they step onto the global stage,… pic.twitter.com/9W32B3aIhR
— Hockey India (@TheHockeyIndia) November 21, 2025
లైంగిక వేధింపుల నివారణ చట్టం ప్రకారం బాధితురాలు, కోచ్, ఫిర్యాదుదారు పేర్లను గోప్యంగా ఉంచనున్నారు. ఈ కేసును తాము విచారించిన తర్వాతే నిర్ణయానికి రాగలమని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇదే విషయంపై హాకీ ఇండియాను సంప్రదించగా.. తమకు ఈ విషయం తెలియదని అంటున్నారు. నేను ఇలాంటి ఘటన జరిగినట్టు ఇదే మొదటిసారి వింటున్నా. హాకీ ఇండియా దృష్టికి రాని విషయంపై నేను స్పందించలేను. కేంద్ర మంత్రి ఆదేశించిన బృందం దర్యాప్తు వచ్చేంత వరకూ మేము ఎదురుచూస్తాం. విచారణ అధికారులు ఈ విషయం గురించి మమ్మల్ని ఇంకా సంప్రదించలేదు అని హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ భోళానాథ్ సింగ్ వెల్లడించాడు. ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ పోటీలు చిలీలోని సాంటియాగోలో డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.