హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్పోర్ట్స్ ఫర్ ఆల్(ఎస్ఎఫ్ఏ) ఆరో ఎడిషషన్ హైదరాబాద్ అంచె పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, కరాటే, స్కేటింగ్, వాలీబాల్ టైటిళ్లు సాధించిన విజ్ఞాన్స్ బో ట్రీ స్కూల్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ రన్నరప్ టైటిల్ దక్కించుకుంది.
బాలుర అండర్-9 అథ్లెటిక్స్, స్కేటింగ్‌లో స్వర్ణం, రెండు రజతాలు గెలిచిన ధ్రువకు గోల్డెన్ బాయ్ టైటిల్ లభించగా, బాలికల అండర్-16లో జొహన్న 4స్వర్ణాలు, 2 రజతాలతో గోల్డెన్ గర్ల్‌గా నిలిచింది.