కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో రానే వచ్చింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసేలా క్రీడాకారులు సై అంటున్నారు. నిరుటి విజయాలను మరిపిస్తూ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించేందుకు సమరోత్సాహంతో ఉన్నారు. ప్రపంచ క్రీడా యవనికపై తమదైన ముద్ర వేసేందుకు ప్లేయర్లు సర్వశక్తులతో సిద్ధమంటున్నారు. చాంపియన్స్ ట్రోఫీ, మహిళల వన్డే వరల్డ్‌కప్ విజయాలతో దేశ క్రికెట్‌కు మరింత జోష్ నిండగా, ఈసారి అంతకుమించి అభిమానులను అలరించేందుకు క్రికెట్ మెగాటోర్నీలు రెడీగా ఉన్నాయి.
అండర్-19 వరల్డ్‌కప్‌తో మొదలుపెడితే, టీ20 ప్రపంచకప్, మహిళామణుల పొట్టిపోరుతో క్రికెట్ మజా మరో స్థాయికి వెళ్లనుంది. క్రికెటే కాకుండా ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడలు, ఫిఫా ప్రపంచకప్ టోర్నీ నయా సాల్ కొత్త సందడి తీసుకురాబోతున్నాయి. వీటికి తోడు అభిమానుల కోసం ఫార్ములావన్ చాంపియన్‌షిప్, గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలు, బ్యాడ్మింటన్ టోర్నీలు, మల్లయోధుల పట్టు, అథ్లెట్ల పరుగుల పోటీలు వెరసి కొత్త ఏడాది అభిమానులకు పసందైన విందు అందించడం ఖాయంగా కనిపిస్తున్నది. మరింకెందుకు ఆలస్యం ఈ ఏడాది క్రీడా క్యాలెండర్‌పై ఓ లుక్కేద్దాం పదండి.

క్రికెట్ మెగాటోర్నీలు:
అండర్-19 వరల్డ్‌కప్:
జనవరి 15-ఫిబ్రవరి 6
వేదిక: జింబాబ్వే, నమీబియా
టీ20 ప్రపంచకప్
ఫిబ్రవరి 7- మార్చి 8
వేదికలు: భారత్, శ్రీలంక
మహిళల టీ20 ప్రపంచకప్
జూన్ 12-జూలై 5
వేదిక: ఇంగ్లండ్
భారత్ షెడ్యూల్:
జనవరి 11-18
భారత్, న్యూజిలాండ్
వన్డే సిరీస్
జనవరి 21-31
భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్
ఐపీఎల్:
మార్చి 26-మే 31
ఇంగ్లండ్‌లో భారత్
జూలై 1-19 వరకు
ఐదు టీ20లు, 3 వన్డేలు
శ్రీలంకలో భారత్:
ఆగస్టు: రెండు టెస్టులు
(తేదీలు ఖరారు కావాల్సి ఉంది)
భారత్, అఫ్గానిస్థాన్
సెప్టెంబర్‌లో: మూడు టీ20లు
భారత్‌లో వెస్టిండీస్ టూర్
సెప్టెంబర్‌లో: 3వన్డేలు, 5 టీ20లు
న్యూజిలాండ్‌లో భారత్:
అక్టోబర్-నవంబర్:
రెండు టెస్టులు, 3 వన్డేలు
భారత్‌లో శ్రీలంక:
డిసెంబర్: 3 వన్డేలు, 3టీ20లు
మెగాటోర్నీలు-2026
కామన్వెల్త్ గేమ్స్:
జూలై 23-ఆగస్టు 2 వరకు
వేదిక: గ్లాస్గో
ఆసియా క్రీడలు:
సెప్టెంబర్ 19-అక్టోబర్ 4 వరకు
వేదిక: నగోయా(జపాన్)
ఫిఫా ప్రపంచకప్
జూన్ 11-జూలై 19
వేదికలు: అమెరికా,
మెక్సికో, కెనడా
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ:
మార్చి 28-ఏప్రిల్ 16 వేదిక: సైప్రస్
హాకీ ప్రపంచకప్:
ఆగస్టు 14-ఆగస్టు 30
వేదికలు: బెల్జియం, నెదర్లాండ్స్
వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ:
ఆగస్టు 17-23
వేదిక: న్యూఢిల్లీ
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్:
ఆస్ట్రేలియన్ ఓపెన్:
జనవరి 12-ఫిబ్రవరి 1
వింబుల్డన్: జూన్ 29-జూలై 12
ఫ్రెంచ్ ఓపెన్: ఆగస్టు 2-13
యూఎస్ ఓపెన్:
ఆగస్టు 23-సెప్టెంబర్ 13
బ్యాడ్మింటన్ టోర్నీలు:
మలేషియా ఓపెన్: జనవరి 6-11
ఇండియా ఓపెన్: జనవరి 13-18
ఇండోనేషియా మాస్టర్స్:
జనవరి 20-25
థాయ్‌లాండ్ మాస్టర్స్:
జనవరి 27-ఫిబ్రవరి 1