హైదరాబాద్,ఆట ప్రతినిధి : జాతీయ హాకీ శిబిరానికి రాష్ట్రానికి చెందిన హర్ష్‌కుమార్, వీణ ఎంపికయ్యారు. రాంచీ వేదికగా ఇటీవల ముగిసిన జాతీయ సబ్‌జూనియర్ హాకీ టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన హర్ష్‌కుమార్, వీణ భోపాల్ సాయ్ సెంటర్లో శిక్షణ పొందనున్నారు.
ఈనెల 19 నుంచి మొదలయ్యే క్యాంప్ ద్వారా అండర్-18 జూనియర్ ఆసియా కప్ టోర్నీకి భారత జట్లను ఎంపిక చేయనున్నారు. వచ్చే నెల 29 నుంచి జూన్ 6వ తేదీ వరకు జపాన్ వేదికగా ఆసియా కప్ హాకీ టోర్నీ జరుగనుంది.