CSK vs KKR : పంతొమ్మిదో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కథ మారడం లేదు. వేదిక మారినా ఆ జట్టు పరాజయాల వ్యథ మాత్రం మారడం లేదు. రెండొందలకుపైగా కొడుతుందునుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను 192కే నిలువరించిన కోల్‌కతాను బ్యాటర్లు నిట్ట నిలువునా ముంచేశారు. నూర్ అహ్మద్(3-21) స్పిన్ మాయాజాలం చూపిస్తూ మూడు వికెట్లతో 11వ ఓవర్లోనే సీఎస్కే గెలుపు ఖాయం చేశాడు. ఈ కుర్ర స్పిన్నర్ ధాటికి మిడిలార్డర్ కుప్పకూలగా.. ఆఖర్లో రొవ్మన్ పావెల్(31), రమన్‌దీప్(35 నాటౌట్) పోరాడినా సరిపోలేదు. దాంతో, చెన్నై వరసగా రెండో విజయం నమోదు చేసింది.
మూడుసార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పంతొమ్మిదో సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు. ఓపెనింగ్ జోడీని మార్చిన కలిసి రాలేదు. డేంజరస్ ఓపెనర్ ఫిన్ అలెన్(1) ఔటయ్యాడు.. అయితే.. వికెట్ పడగా.. సునీల్ నరైన్(24)కు 18 పరుగుల వద్ద లైఫ్ లభించింది. క్యాచ్ వదిలేశాడు. కానీ, ఖలీల్ అహ్మద్ రెండో బంతికి స్లిప్‌లో గుర్జన్‌పీత్‌కు నరైన్ దొరికాడు. 29కే రెండు వికెట్లు పడిన వేళ.. రఘువంశీ(27), కెప్టెన్ అజింక్యా రహానే (28)లు గెలిపించే బాధ్యత తీసుకున్నారు.
The home side with a successful powerplay ☝️☝️#KKR 36/2 after 6 overs.
Who is taking the victory tonight? 🤔
Updates ▶️ https://t.co/jWkXVCPxj5#TATAIPL | #KhelBindaas | #CSKvKKR pic.twitter.com/EdWQFd1iop
— IndianPremierLeague (@IPL) April 14, 2026
ఓపెనర్లు తేలిపోగా రహానే, రఘువంశీ ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో ఆశలు రేపారిద్దరూ. కానీ, 11వ ఓవర్లో నూర్ అహ్మద్(3-21) వరస బంతుల్లో రహానే, కామెరూన్ గ్రీన్(0)ను బౌల్డ్ చేసి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. ఆ తర్వతి ఓవర్లో డేంజరస్ రింకూ సింగ్(6)ను వెనక్కి పంపిన ఈ స్పిన్నర్ మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పాడు. రొవ్మన్ పావెల్(31), రమన్‌దీప్ సింగ్(35 నాటౌట్)లు పోరాడినా గెలిపించలేకపోయారు. 32 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిన సీఎస్కే ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Come for the wickets, stay for the celebration 😉
🎥 Noor Ahmad is 𝙏𝙪𝙧𝙣𝙞𝙣𝙜 𝙩𝙝𝙚 𝙂𝙖𝙢𝙚 for the Super Kings 💛
Updates ▶️ https://t.co/jWkXVCPxj5#TATAIPL | #KhelBindaas | #CSKvKKR | @ChennaiIPL | @noor_ahmad_15 pic.twitter.com/IJa0OhBJWP
— IndianPremierLeague (@IPL) April 14, 2026
టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లో సంజూ శాంసన్(48) హ్యాట్రిక్ ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటాడు. అయితే.. ఫామ్‌లో లేని రుతురాజ్ గైక్వాడ్(7)ను అనుకుల్ రాయ్ చేసి బ్రేకిచ్చాడు. శాంసన్ జతగా ఆయుష్ మాత్రే(38) దూకుడుగా ఆడాడు. నాలుగో ఓవర్లో 4, 4, 6, 6తో ఇరవై రన్స్ పిండుకున్నాడు మాత్రే. రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించిన మాత్రేను వైభవ్ అరోరా ఔట్ చేసి రెండో వికెట్ అందించాడు.

ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్(23) జతగా రెచ్చిపోయిన సంజూను కార్తిక్ త్యాగీ బౌల్డ్ చేశాడు. 111కే మూడు వికెట్లు పడిన వేళ.. కోల్‌కతా బౌలర్లపై డెవాల్డ్ బ్రెవిస్ (41), సర్ఫరాజ్ ఎదురుదాడికి దిగారు. నరైన్ ఓవర్లో సర్ఫరాజ్ బౌల్డవ్వగా.. అర్ధ శతకానికి చేరువైన బ్రెవిస్‌ను కార్తిక్ త్యాగి వెనక్కి పంపాడు. డెత్ ఓవర్లలో ఓవర్టన్(7 నాటౌట్), శివం దూబే(13 నాటౌట్)లు ధనాధన్ ఆడలేకపోవడంతో 200లు కొట్టాలనుకున్న చెన్నై 192కే పరిమితమైంది.