హైదరాబాద్, ఆట ప్రతినిధి: గాడియ స్పోర్టోఫియా బ్యాడ్మింటన్ టోర్నీలో భవేశ్రెడ్డి, చిన్మయ్ విజేతలుగా నిలిచారు. మంగళవారం ముగిసిన టోర్నీ డబుల్స్ ఫైనల్లో భవేశ్రెడ్డి, చిన్మయ్ జోడీ 21-15, 17-21, 21-13తో డెన్నిస్ రోనవీ, లియాన్స్ జెలా ద్వయంపై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. బాలుర సింగిల్స్ తుది పోరులో భవేశ్ 20-22, 12-21తో చిన్మయ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు.
బాలుర అండర్-11 విభాగంలో శ్రీరాం శహంత, బాలికల కేటగిరీలో మదలస సాయి విజేతలుగా నిలిచారు. టైటిల్ గెలిచిన ప్లేయర్లను ప్రియాంశు రజావత్, రామకృష్ణారెడ్డి పతకాలు అందజేశారు.