ముంబై: అప్రతిహత విజయాలతో ప్రపంచకప్ (Cricket World Cup) ఫైనల్లో టీమ్ఇండియా (Team India) అడుగుపెట్టింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని (Ahmedabad) నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ మ్యాచ్ చూసేందుకు ప్రక్షకులు అహ్మదాబాద్‌కు క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే క్రికెట్ అభిమానుల కోసం అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లను (Special trains) నడుపుతున్నది. ముంబైలోని ఛత్రపతి శివాజి టెర్మినస్ (CSMT) నుంచి శనివారం రాత్రి 10.30 గంటలకు బయల్దేరుతుంది. ఆదివారం ఉదయం 6.40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. కాగా, అక్టోబర్ 14న ఇండియా-పాక్ మ్యాచ్ సందర్భంగా కూడా అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడిపిన విషయం తెలిసిందే.
ప్రయాణికుల డిమాండ్ మేరకు విస్తారా ఎయిర్‌లైన్స్ (Vistara Airlines) కూడా అదనంగా ఎనిమిది విమానాలను అహ్మదాబాద్‌కు నడుపుతున్నది. నవంబర్ 18, 20 తేదీల్లో వీటిని నడుపనున్నట్లు ప్రకటించింది. వాటిలో ఐదు విమానాలు ముంబై నుంచి, మూడు ఢిల్లీ నుంచి బయల్దేరుతాయని వెల్లడించింది.
#WATCH | Gujarat: Cricket fans arrive in Ahmedabad ahead of the #ICCCricketWorldCup final match
India will face Australia in the finals of the #ICCCricketWorldCup at Narendra Modi Stadium in Ahmedabad tomorrow, November 19 pic.twitter.com/t5FbDPS3xp
— ANI (@ANI) November 18, 2023
#WATCH | Ahmedabad, Gujarat: Varun, a cricket fan, says, “I have come here to watch the final match. It will be an amazing match. India will win the World Cup. The whole country is supporting Team India and we are winning the Cup…” pic.twitter.com/8hbrXvuz7s
— ANI (@ANI) November 18, 2023