Euro Cup | గెల్సెన్కిర్చెన్: యూరో కప్లో డిఫెండింగ్ చాంపియన్ ఇటలీకి స్పెయిన్ షాకిచ్చింది. శుక్రవారం గెల్సెన్కిర్చెన్ (జర్మనీ) వేదికగా జరిగిన పోరులో స్పెయిన్ 1-0తో ఇటలీని ఓడించింది. ఆట ద్వితీయార్ధం 55వ నిమిషంలో ఇటలీ ఆటగాడు రికార్డో కలఫియోరి సెల్ఫ్ గోల్ చేయడం ఆ జట్టును దెబ్బతీసింది. యూరో కప్లో ఇది ఐదో సెల్ఫ్ గోల్ కావడం గమనార్హం.