పారిస్: స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ కు శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. ఎడమ పిక్క భాగం గాయంతో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమైన సంగతి విదితమే.
2005లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తరువాత రికార్డు స్థాయిలో 14 సార్లు ఇక్కడ టైటిల్ గెలిచిన నాదల్, ఈ యేడాది ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత గాయం కారణంగా ఏ టోర్నీలోనూ పాల్గొనలేదు.