అడిలైడ్: సౌత్ ఆస్ట్రేలియా టీమ్ తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న ప్రతిష్ఠాత్మక షెఫీల్డ్ షీల్డ్ టోర్నీని సౌత్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. క్వీన్స్ల్యాండ్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో సౌత్ ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించింది.
270 పరుగుల లక్ష్యఛేదనలో సౌత్ ఆస్ట్రేలియా..జాసన్ సంగా(126 నాటౌట్) అజేయ సెంచరీకి తోడు అలెక్స్ క్యారీ(105) శతకంతో విజృంభించాడు. వీరిద్దరు 202 పరుగుల భాగస్వామ్యంతో జట్టు విజయంలో కీలకమయ్యారు.