Womens World Cup : ఫార్మాట్ ఏదైనా సరే ఒకప్పుడు దక్షిణాఫ్రికా (South Africa) ఒత్తిడికి చిత్తయ్యేది. పురుషుల జట్టే కాదు మహిళల జట్టుదీ అదే పరిస్థితి. నిరుడు టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో మర్క్రమ్ సేన భారత్ చేతిలో పరాజయం పాలవ్వగా.. న్యూజిలాండ్‌ను నిలువరించలేక మహిళల టీమ్ కప్‌ను అందుకోలేకపోయింది. ఆ పరాభావాల నుంచి పాఠాలు నేర్చుకున్న సఫారీ టీమ్ ఆస్ట్రేలియాను అడ్డుకొని.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) విజేతగా అవతరించింది. బవుమా బృందం స్ఫూర్తితో ఇప్పుడు వరల్డ్ కప్‌లో చెలరేగుతోంది మహిళల జట్టు. ఇంగ్లండ్‌పై 69 ఆలౌట్ తర్వాత పుంజుకున్న లారా వొల్వార్డ్త్(Laura Wolvaardt) సేన.. వరుసగా మూడు విజయాలతో సత్తా చాటింది. సమిష్టిగా రాణిస్తూ ప్రత్యర్థులకు చెక్ పెడుతున్న సఫారీ టీమ్ తొలి ఐసీసీ ట్రోఫీ (ICC Trophy) కలను సాకారం చేసుకునే దిశగా బలమైన అడుగులు వేస్తోంది.
పదమూడో సీజన్ వరల్డ్ కప్‌ను ఓటమితో మొదలెట్టిన దక్షిణాఫ్రికా (South Africa) కోలుకోవడం కష్టమనుకున్నారంతా. ‘ఇంగ్లండ్ స్పిన్నర్ల ధాటికి .. 69కే ఆలౌటై భారీ ఓటమి మూటగట్టుకున్న ఆ జట్టు ఫేవరెట్టా?’ అని ప్రశ్నించారు కొందరు. కానీ.. ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసుకోవాలనే సంకల్పంతో ఉన్న దక్షిణాఫ్రికా అనూహ్యంగా పుంజుకొని ఔరా అనిపిస్తోంది. ’69 ఆలౌట్ కంటే మా జట్టు ఎంతో మెరుగైనది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం’ అని కెప్టెన్ లారా వొల్వార్డ్త్ అన్న మాటల్ని నిజం చేస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తోంది సఫారీ సైన్యం. వరుసగా బలమైన జట్లు న్యూజిలాండ్, భారత్‌కు షాకిస్తూ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. సఫారీల సంచలన ప్రదర్శనకు సమిష్టితత్త్వమే కారణం.
𝐖𝐡𝐚𝐭. 𝐀. 𝐆𝐫𝐚𝐛. 🔥
Incredible reflexes from Laura Wolvaardt! 🙌#CricketTwitter #CWC25 #NZvSApic.twitter.com/MH4MkTOgp6
— Female Cricket (@imfemalecricket) October 6, 2025
అవును.. మిగతా జట్లలా ఏ ఒక్కరిద్దరి మీదనో ఆ జట్టు ఆధారపడడం లేదు. టాపార్డర్‌లో కెప్టెన్ లారా వొల్వార్డ్త్, తంజిమ్ బ్రిట్స్, సునే లస్.. వీరు విఫలమైతే.. మిడిల్లో మరినే కాప్, క్లో ట్రయాన్ దంచేస్తున్నారు. వీళ్లందరూ ఔటైనా .. లోయర్ ఆర్డర్లో నడినే డీక్లెర్క్ (Nadine de Klerk) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అద్భుత విజయాలను కట్టబెడుతోంది. కివీస్‌పై 232 పరుగుల ఛేదనలో తంజిమ్ బ్రిట్స్ మెరుపు శతకంతో జట్టును గెలిపించింది. కానీ, టీమిండియా, బంగ్లాదేశ్‌పై ఆ జట్టు విజయాలను గమనిస్తే మనకు సఫారీల బ్యాటింగ్ డెప్త్ అర్ధమవుతోంది.
కెప్టెన్ లారా వొల్వార్డ్త్.. తంజిమ్ బ్రిట్స్.. ఒక మ్యాచ్‌లో మెరిస్తే.. డీక్లెర్క్ ఫినిషర్ అవతారంలో అదరగొడుతోంది. బౌలింగ్ యూనిట్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మ్లాబా మూడు మ్యాచుల్లో ఆరు వికెట్లతో రాణించింది. ఆల్‌రౌండర్లు మరినే, ట్రయాన్ సైతం వికెట్ల వేట కొనసాగించడం సఫారీ టీమ్‌కు లాభిస్తోంది.
THE HUNDRED CELEBRATION OF TANZIM BRITS. pic.twitter.com/UPYcT77Qcs
— maddyCric (@imRaghav001) October 7, 2025
వైజాగ్‌లో భారత్‌పై 211-7తో ఓటమి అంచున నిలిచిన జట్టును అర్ధ శతకంతో గెలిపించింది డీక్లెర్క్. ఫినిషర్‌గా తన పాత్రకు నూరుపాళ్లు న్యాయం చేసిన ఈ డాషింగ్ బ్యాటర్ 54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో టీమిండియాకు షాకిచ్చింది. బంగ్లాపైన కూడా అద్భుతమే చేసింది రన్ మెషీన్. మరినే కాప్, చోలే ట్రయాన్లు 85 పరుగులతో గెలుపు దిశగా నడిపించగా బంగ్లా స్పిన్నర్లు ఈ ఇద్దరని ఔట్ చేసి ఒత్తిడి పెంచారు. కానీ, ప్రశాతంగా ఆడి టెయిలెండర్ క్లాస్ సాయంతో జట్టును విజయ తీరాలకు చేర్చిందీ ఫినిషర్.
South Africa clinched a third #CWC25 win in an absolute thriller against Bangladesh 😮💨🤩#SAvBAN pic.twitter.com/4WS0kefYfD
— ICC Cricket World Cup (@cricketworldcup) October 13, 2025
ఆఖరి ఓవర్లో 8 రన్స్ అవసరం కాగా ఫోర్, సిక్సర్ బాది దక్షిణాఫ్రికాకు హ్యాట్రిక్ విజయాన్నికట్టబెట్టింది. అసాధ్యమనే పదమే తన డిక్షనరీలో లేదంటూ 37 పరుగులతో అజేయంగా నిలిచిన డీక్లెర్క్ విధ్వసంతో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. అందుకే.. సఫారీ టీమ్‌కు.. ఆల్‌రౌండర్ డీక్లెర్క్ ట్రంప్ కార్డ్‌గా మారిందంటే అతిశయోక్తి కాదేమో. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో అక్టోబర్ 17న శ్రీలంకతో, అక్టోబర్ 21న పాకిస్థాన్‌తో, అక్టోబర్ 25న ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో లారా వొల్వార్డ్త్ టీమ్ తలపడనుంది.
Nadine de Klerk comes to the rescue again! 💪
She pulled South Africa out of trouble in consecutive games, guiding them to victory. 🇿🇦💥#BANvSA #Cricket #Sportskeeda pic.twitter.com/YEFKQ8JWOT
— Sportskeeda (@Sportskeeda) October 13, 2025