డర్బన్: పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 11 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. తొలుత డేవిడ్ మిల్లర్(40 బంతుల్లో 82, 4ఫోర్లు, 8సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు జార్జ్ లిండే(24 బంతుల్లో 48, 3ఫోర్లు, 4సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 183/9 స్కోరు చేసింది.
షాహిన్ ఆఫ్రిదీ(3/22), అబ్రార్ అహ్మద్(3/37) మూడేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పాక్..లిండే(4/21) ధాటికి 20 ఓవర్లలో 172/8 పరిమితమైంది.