SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
SA vs AUS : డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. స్వదేశంలో దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరగడంతో టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలింది.
SA vs AUS : డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. స్వదేశంలో దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరగడంతో టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలింది. పునరాగమనం మ్యాచ్‌లో అన్రిచ్ నోర్జి(2-26) రెండు కీలక వికెట్లు తీయగా.. యాన్సెన్(2-35), వియాన్ మల్డర్(2-28)లు ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. దాంతో, వరల్డ్ నంబర్ 1 జట్టు చూస్తుండగానే తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయింది.
ఎనిమిదేళ్ల విరామం తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియాను బ్యాటర్లు ముంచారు. డర్బన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరందిస్తారనుకుంటే పేలవమైన ఆటతో నిరాశపరిచారు. సొంతగడ్డపై కొట్టినపిండి అయిన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ సఫారీ పేసర్లు వికెట్ల వేట కొనసాగించారు. అన్రిచ్ నోర్జి(2-26), మార్కో యాన్సెస్(2-35), వియాన్ మల్డర్(2-28)లు రెండేసి వికెట్లతో కంగారూలను కంగారెత్తించారు.
Marnus falls on the LAST ball before lunch!
Australia fight back well, but South Africa are on top after the first session 🍿 https://t.co/azZB5fBFlS
— Cricinfo (@cricinfo) October 9, 2026
ఈ పేస్ త్రయం ధాటికి ట్రావిస్ హెడ్(9), లబూషేన్(37), స్టీవెన్ స్మిత్(25), అలెక్స్ క్యారీ(14)లు పెవిలియన్ చేరారు. దాంతో.. 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన మాజీ ఛాంపియన్ పోరాడుతోంది. ప్రస్తుతం క్రీజులో ఉన్న మ్యాట్ రెన్షా(34 నాటౌట్), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(17 నాటౌట్) నిదానంగా ఆడుతూ భాగస్వామ్యం నిర్మిస్తున్నారు. వీరిద్దరూ జట్టు స్కోర్ కనీసం రెండొందలు దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

