మెల్బోర్న్: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరుగుతున్న రెండవ టెస్టులో ఓ గమ్మత్తు ఘటన జరిగింది. రెండవ రోజు రెండో సెషనల్లో.. మైదానంలో ఉన్న స్పైడర్క్యామ్.. దక్షిణాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్జాను ఢీకొట్టింది. సౌతాఫ్రికా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వైర్లకు వేలాడే స్పైడర్క్యామ్లు.. మ్యాచ్ టైమ్లో అటూ ఇటూ కదిలే విషయం తెలిసిందే. అయితే నోర్జా ఫీల్డింగ్ కోసం వెళ్తున్న సమయంలో.. వెనుక నుంచి వచ్చిన స్పైడర్క్యామ్ అతన్ని ఢీకొట్టింది. దీంతో నోర్జా కిందపడిపోయాడు. అతని భుజానికి, మోచేతికి ఆ కెమెరా బలంగా తగిలింది. ఈ ఘటన పట్ల ఫాక్స్ స్పోర్ట్స్ స్పందించింది. స్పైడర్క్యామ్ ఆపరేటర్ పొరపాటు వల్ల ఆ ఘటన జరిగినట్లు చెప్పింది. నోర్జా మాత్రం ఆ తర్వాత బౌలింగ్ వేశాడు. ఓ వికెట్ కూడా తీశాడు.
Here’s the @FoxCricket Flying Fox / Spider Cam doing its bit to help the Aussie cricketers build a healthy lead against South Africa… 😬🎥 Hope the player it collided with (Nortje?) is okay! #AUSvSA pic.twitter.com/9cIcPS2AAq
— Ari (@arimansfield) December 27, 2022
ఇవాళ ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 575 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఒక వికెట్ నష్టానికి 15 రన్స్ చేసిన సమయంలో వర్షం వల్ల మ్యాచ్ను నిలిపివేశారు. సౌతాఫ్రికా ఇంకా 371 రన్స్ వెనుకబడి ఉంది.