Sri Lanka Vs South Africa | డర్బన్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 233 పరుగుల తేడాతో భారీ గెలుపుతో సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 516 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 103/5తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన లంక 282 పరుగులకు పరిమితమైంది. 11 వికెట్లు ఖాతాలో వేసుకున్న జాన్సెన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.