INDA vs SAA : రెండో అనధికారిక టెస్టులో పట్టుబిగించిన భారత ఏ జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. ధ్రువ్ జురెల్(132 నాటౌట్,127 నాటౌట్) సెంచరీలతో దక్షిణాఫ్రికా ‘ఏ’ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. బౌలర్లు విఫలమవ్వడంతో పరాజయం తప్పలేదు. ప్రధాన పేసర్లు సిరాజ్, ఆకాశ్ సహ కుల్దీప్ యాదవ్ సైతం తేలిపోగా.. సఫారీ కుర్రాళ్లు అర్ద శతకాలతో లక్ష్యాన్ని కరిగించారు. ఆఖర్లో రెండుమూడు వికెట్లు పడినా.. వికెట్ కీపర్ కొన్నొర్ ఎస్టెర్హుజెన్(52 నాటౌట్) ధనాధన్ ఆడి 5 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు. చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయింది.
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత ఏ జట్టుకు ఊహించని పరాజయం ఎదురైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో ధ్రువ్ జురెల్(132 నాటౌట్,127 నాటౌట్) సెంచరీలకు, హర్ష్ దూబే(84), కెప్టెన్ రిషభ్ పంత్(65)ల అర్ధ శతకాలు తోడవ్వగా విజయంపై భరోసాతో ఉన్న టీమిండియాకు సఫారీ బృందం షాకిచ్చింది. రెండో ఇన్నింగ్స్‌ను 382-7 వద్ద డిక్లేర్ చేసి 418 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా దక్షిణాఫ్రికా ఏ బ్యాటర్లు ఉఫ్మనిపించారు.
తొలి ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగిన ప్రసిధ్ కృష్ణ, సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో.. ఓపెనర్లు జోర్డాన్ హెర్న్మన్(91), లెసెగో సెనొక్వెనే(77)లు క్రీజునంటుకుపోయారు. నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోర్ 25/0తో ఇన్నింగ్స్ ఆరంభించి.. హాఫ్ సెంచరీలతో శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కు 156 రన్స్ జోడించి సఫారీల విజయానికి బాటలు వేశారు. ప్రసిధ్, దూబే వీరిద్దరిని ఔట్ చేసినా.. ఆ తర్వాత వచ్చిన జుబైర్ హంజా(77), తెంబా బవుమా(59)లు క్రీజులో పాతుకుపోయారు. అటాకింగ్ గేమ్ ఆడిన ఈ ఇద్దరూ భారత బౌలర్లను విసిగిస్తూ జట్టు స్కోర్ 300 దాటించారు.
RECORD-BREAKING CHASE! 🇿🇦 SA-A overhauls **417-run target** vs India-A in 2nd ‘A’ Test—highest EVER successful chase in ‘A’ Tests! India A pulled off the magic in the 1st… SA-A serves it right back! Epic payback! 🔥#DhruvJurel #TeamIndia #IndiaASeries #Bengaluru #Cricket pic.twitter.com/puJQZMt96l
— lightningspeed (@lightningspeedk) November 9, 2025
ఆకాశ్ దీప్, సిరాజ్ ఎట్టకేలకు వీరిని వెనక్కి పంపగా భారత ఏ విజయంపై ఆశలు రేగాయి. కానీ, అప్పటికీ సఫారీ జట్టు గెలుపు వాకిట నిలవడంతో కొన్నొర్ ఈస్టెర్హుజెన్(52 నాటౌట్), టియాన్ వాన్ వూరెన్(20 నాటౌట్)లు జాగ్రత్తగా ఆడారు. భారత బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా లాంఛనాన్ని ముగించారు. వీరిద్దరి పోరాటంతో 5 వికెట్లతో గెలుపొందిన సఫారీ ఏ టీమ్ సిరీస్‌ను 1-తో సమం చేసింది. సిరీస్‌లో గొప్పగా రాణించిన ధ్రువ్ జురెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికవ్వగా.. దక్షిణాఫ్రికా కెప్టెన్ మర్కెస్ అకెర్మన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
South Africa A have pulled off a huge chase, 417 runs against India A in the 2nd multi-day match at the BCCI CoE 😵
And with that, the series is now level at 1–1. 🏆#INDvsSA #TeamIndia #CricketTwitter #SouthAfrica pic.twitter.com/TcK9VKpY8L
— CRICKETNMORE (@cricketnmore) November 9, 2025