RSA vs BAN : టీ20 వరల్డ్ కప్‌లో ఊహించని బౌన్స్.. లో స్కోరింగ్ మ్యాచ్‌లతో వార్తల్లో నిలుస్తున్న న్యూయార్క్ పిచ్‌పై బంగ్లాదేశ్(Bangladesh) బౌలర్లు విజృంభిస్తున్నారు. దాంతో, దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. తంజిమ్ హసన్ షకిబ్ నిప్పులు చెరగడంతో 23 రన్స్‌కే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం హెన్రిచ్ క్లాసెన్(21), డేవిడ్ మిల్లర్(13)లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. రిషద్ హొసేన్ వేసిన 10వ ఓవర్లో క్లాసెన్ 91 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత బంతిని బౌండరీకి పంపి జట్టు స్కోర్ 50 దాటించాడు. 10 ఓవర్లకు సఫారీల స్కోర్.. 57/4.
Wreaking havoc in New York 🔥
A fiery three-wicket haul from Tanzim Hasan has restricted South Africa to 25/4 inside the Powerplay 👏#T20WorldCup | #SAvBAN | 📝: https://t.co/6KUOfBCr5O pic.twitter.com/eWKCdvzPTj
— ICC (@ICC) June 10, 2024
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తీసుకొంది. అయితే.. బౌన్స్ అవుతున్న పిచ్‌పై బంగ్లా పేసర్లు వికెట్ల వేట మొదలెట్టడంతో ఎవరు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్(0)ను ఎల్బీగా వెనక్కి పంపిన షకిబ్.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(18)ను బౌల్డ్ చేసి సఫారీ జట్టుకు పెద్ద షాకిచ్చాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను తస్కిన్ దెబ్బకొట్టాడు. కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(4)ను బౌల్డ్ చేశాడు. ఆకాసేపటికే కుర్రాడు ట్రిస్టన్ స్టబ్స్(0) సైతం ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది.