Sourav Ganguly: తన పేరుతో ఉన్న ఎఫ్బీ పేజీపై సౌరవ్ గంగూలీ ఫిర్యాదు
Sourav Ganguly : క్రికెటర్ సౌరవ్ గంగూలీ.. కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఫేస్బుక్ పేజీని ఆపరేట్ చేసి.. తన ప్రతిష్టను దిగజార్చుతున్నట్లు ఆయన ఆరోపించారు. సౌరవ గంగూలీ ఫ్యాన్స్ అన్న పేజీలో తనకు సంబంధం లేకుండానే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly).. ఇవాళ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఫేస్బుక్ పేజీని ఆపరేట్ చేసి.. తన ప్రతిష్టను దిగజార్చుతున్నట్లు ఆయన ఆరోపించారు. సౌరవ గంగూలీ ఫ్యాన్స్ అన్న సోషల్ మీడియా పేజీలో తనకు సంబంధం లేకుండానే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్పోర్ట్స్వికీ అనే మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై కూడా సౌరవ్ గంగూలీ ఫిర్యాదు చేశారు. థాకుర్పుకుర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తన ప్రతిష్టను కళంకం చేసే రీతిలో ఫేస్బుక్ పేజీలో నిరంతరం పోస్టులు చేస్తున్నారని, ప్రజల్లో తన పట్ల నెగటివ్ భావన వచ్చేలా ప్రవర్తిస్తున్నారని గంగూలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను పబ్లిక్ ఫిగర్ కావడం వల్ల సమస్య మరింత పెరుగుతోందని, కానీ తప్పుడు విషయాలను వ్యాప్తి చేస్తున్నారని, అభ్యంతరకర, డ్యామేజింగ్ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని, తన గౌరవాన్ని భంగపరిచే రీతిలో వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో కఠినన న్యాయపరమైన చర్య తీసుకోవాలని గంగూలీ తన ఫిర్యాదులో కోరారు. సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ పేరుతో ఫేస్బుక్ పేజీని ఆపరేట్ చేస్తున్నవారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

