కోల్‌కతా : భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలలో తమ పాత్ర ఎంతమాత్రం లేదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. టికెట్లు అమ్మకాల గోల్‌మాల్‌లో తన సోదరుడు స్నేహశిష్కుగానీ, తనకుగానీ ఎటువంటి పాత్ర లేదని, పోలీసులు దోషులను పట్టుకుంటారన్న నమ్మకముందన్నాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు దొడ్డిదారిన అమ్ముకుంటున్నారని ఒక క్రికెట్ అభిమాని ఫిర్యాదు మేరకు మైదాన్ పోలీసు స్టేషన్ అధికారులు బుధవారం స్నేహశిష్కు నోటీసులు జారీచేశారు. ఆరోపణలపై గంగూలీ స్పందిస్తూ టికెట్ల అమ్మకాలలో తమ జోక్యం లేదని ఖండించాడు. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం సామర్థ్యం 67,000 కాగా లక్షకుపైగా అభిమానులు టికెట్లు ఆశించారు. అతి తక్కువ ధర రూ.900 టెకెట్లు బ్లాక్మార్కెట్లో రూ.5000 అమ్ముతుండడం అభిమానులు ఆగ్రహానికి ఆజ్యం పోసినట్టయింది. టికెట్ల అమ్మకాల గోల్‌మాల్‌పై అభిమానులు క్యాబ్ (క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్), బీసీసీఐ, ఆన్లైన్ టికెట్ల అమ్మకాల సంస్థ బుక్ మై షో పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్ రోజునే కోహ్లీ జన్మదినమైనందున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని క్యాబ్ రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఇందుకు బీసీసీఐ ఆమోదం లభించనందున ఎలాంటి వేడుకలు నిర్వహించడం లేదని క్యాబ్ వెల్లడించింది.