Soumya Sarkar : ఆసియా కప్‌లో ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకున్న బంగ్లాదేశ్ (Bangldesh) యూఏఈ వేదికగా అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. అయితే.. స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్ (Soumya Sarkar)కు సిరీస్‌కు ముందే కష్టాలు మొదలయ్యాయి. పొట్టి సిరీస్‌లో ఓపెనర్‌గా చెలరేగాలని భావిస్తున్న సర్కార్‌కు వీసా ఇంకా ఖరారు కాలేదు. దాంతో, అతడు సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి.
అక్టోబర్ 2న టీ20 ప్రారంభం కానుంది. దాంతో, ఆలోపు సర్కార్ వీసాకోసం యూఏఈతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటివరకూ సౌమ్యా సర్కార్‌కు యూఏఈ వీసా మంజూరు కాలేదు. మేము ఎదురుచూస్తున్నాం. వీసా రాగానే అతడు సాధ్యమైనంత తొందరగా యూఏఈకి బయల్దేరుతాడు అని క్రిక్‌బజ్‌తో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించాడు.
🚨 ONE DAY TO GO FOR AFG SERIES — SOUMYA STILL VISALESS! 🤯⚠️
One day left for the Afghanistan series, but Soumya Sarkar is still without a 🇦🇪 visa! ❌
His availability for the opening match remains uncertain… 👀#SoumyaSarkar #BANvsAFG #fblifestyle pic.twitter.com/d6ulA7GupE
— Muhammad Hafeez (@MrHafeez2000) September 30, 2025
ఇటీవలే ఎన్సీఎల్ టోర్నీలో వరుసగా రెండు మ్యాచుల్లో 63, 45 రన్స్‌తో రాణించాడు సౌమ్యా సర్కార్. దాంతో.. రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్ గాయం నుంచి కోలుకోకపోవడంతో అనుభవజ్ఞుడైన సౌమ్యా సర్కార్‌ను తీసుకున్నారు సెలెక్టర్లు. కానీ, స్క్వాడ్‌లోని అందరికీ వీసా మంజూరైంది. కానీ, అతడికి వీసా కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. అదే జరిగితే.. అక్టోబర్ 2 షార్జా వేదికగా బంగ్లా, కాబూలీ టీమ్ మధ్య జరుగనున్న తొలి మ్యాచ్‌కు సర్కార్ దూరమవ్వడం ఖాయం. అక్టోబర్ 3న రెండో టీ20, అక్టోబర్ 5వ తేదీన మూడో 20 లో ఇరుజట్లు తలపడనున్నాయి.
🔥 Bangladesh Squad for Afghanistan T20I Series! 🔥
🇧🇩 Jaker Ali Anik will captain the side with Litton Kumer Das still out injured.
👊 Soumya Sarkar returns as the only change from the Asia Cup squad.
📅 Matches: Oct 2, 3 & 5 | 📍 Sharjah Cricket Stadium, UAE
Squad:Jaker Ali… pic.twitter.com/SzntTn3ejs
— Bangladesh Cricket (@BCBtigers) September 28, 2025
బంగ్లాదేశ్ స్క్వాడ్ : జకీర్ అలీ(కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హొసేన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదయ్, షమిమ్ హొసేన్, సౌమ్యా సర్కార్, నురుల్ హసన్, రిషధ్ హొసేన్, మెహిదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్, షొరిఫుల్ ఇస్లాం, మొహమ్మద్ సైఫుద్దీన్.