Sophie Molineux | మేము మెరుగైన స్థితిలో ఉన్నాం.. భారత్‌పై ఒత్తిడిని రెండింతలు చేస్తాం..!
Sophie Molineux : మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ రేసులో నిలిచిన భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియా పరీక్షకు సిద్ధమవుతోంది. కానీ, ఒత్తిడంతా భారత్‌పైనే ఉందని ఆసీస్ కెప్టెన్ సోఫీ మొలినెక్స్ (Sophie Molineux) అంటోంది.
Sophie Molineux : మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ రేసులో నిలిచిన భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియా పరీక్షకు సిద్ధమవుతోంది. గ్రూప్ ఏ నుంచి రెండో స్థానంలో నిలిచిన టీమిండియా ఆసీస్‌ను ఓడిస్తే ఆరు పాయింట్లతో సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. దాంతో.. ఎలాగైనా కంగారూలను కంగుతినిపించాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పట్టుదలతో ఉంది. కీలక మ్యాచ్ కావడంతో గెలుపుపై భారత్ ధీమాతో ఉంది. కానీ, ఒత్తిడంతా భారత్‌పైనే ఉందని, తాము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆసీస్ కెప్టెన్ సోఫీ మొలినెక్స్ (Sophie Molineux) అంటోంది.
చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించేందుకు భారత జట్టు పక్కాగా సిద్ధమవుతోంది. నాలుగు విజయాలతో జోరుమీదున్న ఆసీస్‌ను నిలువరించేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మొలినెక్స్ మాట్లాడుతూ.. ఒత్తిడంతా టీమిండియాపైనే ఉందని చెప్పింది.
Hopefully, Australia can double down on that and put pressure on them as well quite early in the game: Sophie Molineux #SophieMolineux #WomensT20WorldCup #INDWvsAUSWhttps://t.co/eR80SFdOmx
— India Today Sports (@ITGDsports) June 27, 2026
‘భారత్ కంటే మేము మెరుగైన స్థితిలో ఉన్నాం. అగ్రస్థానంతో లీగ్ దశను ముగించేందుకు మాకు మరో విజయం కావాలి. చెప్పాలంటే భారత్‌పైనే ఒత్తిడి ఉంది. ఆరంభంలోనే మేము టీమిండియాపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తాం. కానీ, భారత్‌తో ప్రతి మ్యాచ్‌లో తీవ్ర పోటీ ఎదురువుతుంది. ప్రేక్షకులతో నిండిన స్టేడియంలో విజయం కోసం శ్రమిస్తాం. గుడ్‌న్యూస్ ఏంటంటే.. ఫొబే లిచ్‌ఫీల్డ్ కోలుకొని అందుబాటులో ఉంది’ అని మొలినెక్స్ వెల్లడించింది.
2-1తో సిరీస్
ఆరుసార్లు పొట్టి వరల్డ్‌కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఈమధ్యే స్వదేశంలో టీమిండియా చేతిలో 2-1తో పొట్టి సిరీస్ కోల్పోయింది. కాబట్టి.. ఈ సిరీస్ విజయం అనుభవంతో ఆసీస్‌కు చెక్ పెడుతామని భారత ఓపెనర్ షఫాలీ వర్మ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

