ODI World Cup : రెండేళ్ల క్రితం పొట్టి వరల్డ్ కప్ గెలుపొందిన న్యూజిలాండ్ (Newzealand) వన్డే ప్రపంచ కప్ వేటకు సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఇంకా 20 రోజులే ఉండడంతో.. న్యూజిలాండ్ క్రికెట్ పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ అందించిన సోఫీ డెవినే (Sophie Devine) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. అయితే.. తొలిసారిగా నలుగురు కొత్తవాళ్లకు వరల్డ్ కప్ ఆడే అవకాశం కల్పించారు సెలెక్టర్లు. వీళ్లలో ఒకరు అన్క్యాప్డ్ ప్లేయర్ కాగా.. తక్కిన ముగ్గురు ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు.
న్యూజిలాండ్ వరల్డ్ కప్ స్క్వాడ్‌లోని ఇంగ్లండ్ పర్యటనలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన డెవాన్‌షైర్ 18 వికెట్లతో రాణించింది. ఆల్‌రౌండర్ అయిన తను బ్యాటుతోనూ చెలరేగి 266 రన్స్ కొట్టింది. ఇంగ్లిస్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా చోటు దక్కించుకుంది. ఇక ఇల్లింగ్ విషయానికొస్తే.. శ్రీలంక, ఇంగ్లండ్ ఏ జట్లపై వికెట్ల వేట కొనసాగించింది.
Flora Devonshire (uncapped), Bree Illing (3 ODIs), Polly Inglis (3) and Bella James (2) have been included in New Zealand’s squad, led by Sophie Devine, for the upcoming ODI World Cup https://t.co/tpl5K7Mb2w pic.twitter.com/roJyayJyRr
— ESPNcricinfo (@ESPNcricinfo) September 10, 2025
న్యూజిలాండ్ స్క్వాడ్ : సోఫీ డెవినే(కెప్టెన్), సుజీ బేట్స్, ఎడెన్ కార్సన్, ఫ్లోరా డెవాన్‌షైర్, ఇజీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూకే హల్లిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లీస్(వికెట్ కీపర్), బెల్లా జేమ్స్, జెస్ కేర్, మిలే కేర్, రోస్మెరీ మైర్, జార్జియా పిమ్మర్, లీ తహుహు.
కెప్టెన్ సోఫీ డెవినేతో పాటు సీనియర్ సుజీ బేట్స్‌కు ఇది ఐదో వన్డే వరల్డ్ కప్. లీ తుహుహుకు నాలుగోది కాగా.. మ్యాడీ గ్రీన్, మేలియా కేర్లు మూడోసారి వరల్డ్ కప్ బరిలో ఉన్నారు. డెవినే సారథ్యంలోనే సారథ్యంలోనే న్యూజిలాండ్ తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న వెటరన్ ఆల్‌రౌండర్ వీడ్కోలు కానుకగా జట్టుకు ట్రోఫీ అందించాని భావిస్తోంది.
కివీస్ జట్టు 2000లో తొలిసారి వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. చివరిసారిగా వైట్ఫెర్న్ టీమ్ 2009లో ఫైనల్ ఆడింది. ఈసారి.. భారత్, లంక వేదికగా జరుగునున్న వరల్డ్ కప్‌లో అక్టోబర్ 1న డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్‌తో న్యూజిలాండ్ తలపడనుంది.