SLW vs NZW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో రెండో విజయంపై కన్నేసిన శ్రీలంకకు కెప్టెన్ చమరి ఆటపట్టు (53) శుభారంభమిచ్చింది. విష్మీ గుణరత్నే(33 నాటౌట్)తో కలిసి న్యూజిలాండ్ బౌలర్లను దంచేసన ఆటపట్టు అర్ధ శతకంతో చెలరేగింది. ఆ తర్వాత గేర్ మార్చాలనుకున్న ఆమె వెనుదిరిగింది. కివీస్ కెప్టెన్ సోఫీ డెవినే ఓవర్లో సిక్సర్‌కు యత్నించి బౌండరీ వద్ద మ్యాడీ గ్రీన్ చేతికి చిక్కింది. దాంతో.. తొలి వికెట్ 101 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. గుణరత్నే జతగా హాసిన పెరీరా జట్టుకు భారీ స్కోర్ అందించే పనిలో ఉంది. 25 ఓవర్లకు శ్రీలంక స్కోర్.. 103-1.
కొలంబోలోని ప్రేమదాస మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శ్రీలంకకు అదిరే ఆరంభం లభించింది. న్యూజిలాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న చమరి ఆటపట్టు (53), విష్మీ గుణరత్నే(33 నాటౌట్)లు పవర్ ప్లేలో రన్స్ జోడించారు. ఆ తర్వాత కూడా వైట్‌ఫెర్న్స్ బౌలర్లను విసిగించిన ఈ ద్వయం జట్టు స్కోర్ వంద దాటించింది.
Skipper gets skipper! Athapaththu looks to go aggressive against Devine and loses her wicket
👉 https://t.co/BVpI9NQ7wx | #CWC25 https://t.co/5EbyBK1yaE
— ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2025
డెవినే ఓవర్లోనే ఫోర్, ఆపై రెండు పరుగులతో వన్డేల్లో 20వ డెవినే ఓవర్లోనే ఫోర్, ఆపై రెండు పరుగులతో వన్డేల్లో 20వ డెవినే ఓవర్లోనే ఫోర్, ఆపై రెండు పరుగులతో వన్డేల్లో 20వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఆటపట్టు ఆ తర్వాతి ఓవర్లో వెనుదిరిగింది. సోఫీ డెవినే బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్ పెద్ద షాట్ ఆడిన ఆటపట్టు.. బౌండరీ లైన్ వద్ద గ్రీన్ చేతికి దొరికింది. దాంతో.. వికెట్ కోసం నిరీక్షిస్తున్న కివీస్‌కు తొలి వికెట్ లభించింది.