RR vs SRH : ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(103) సొంత గడ్డపై శతకంతో విరుచుకుపడ్డాడు. తోపు బౌలర్లను ఉతికేస్తున్న ఈ చిచ్చరపిడుగు ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు దడ పుట్టిస్తూ 36 బంతుల్లోనే వంద కొట్టేశాడు. తొలి ఓవర్ నుంచే అటాకింగ్ గేమ్‌తో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డును ఉరికించిన వైభవ్.. ధ్రువ్ జురెల్(51)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. డెత్ ఓవర్లలో డొనొవాన్ ఫెరీరా(33) మెరిసినా వరసగా వికెట్లు తీసిన సన్‌రైజర్స్ బౌలర్లు రాజస్థాన్‌ను పరిమితం చేశారు.
ఉప్పల్ స్టేడియంలో డకౌటైన వైభవ్ సూర్యవంశీ (103 : 37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లు) జైపూర్‌లో సన్‌రైజర్స్‌పై పగబట్టినట్టే ఆడాడు. అప్పుడు తనను మొదటి ఓవర్లోనే ఔట్ చేసిన ప్రఫుల్ హింగే(1-49)కు చుక్కలు చూపిస్తూ వరసగా నాలుగు సిక్సర్లు బాదేసిన వైభవ్.. అనంతరం కమిన్స్ బౌలింగ్‌లో బంతిని స్టాండ్స్‌లోకి పంపి ఔరా అనిపించాడు. ఇషాన్ మలింగ ఓవర్లో యశస్వీ జైస్వాల్ ఆడిన బంతిని వెనక్కి పరుగెడుతూ క్లాసెన్ క్యాచ్ అందుకోగా తొలి వికెట్ పడింది. అనంతరం.. ధ్రువ్ జురెల్(51) జతగా రెచ్చిపోయిన ఈ చిచ్చరపిడుగు 15 బంతుల్లోనే అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు.
Ruthless with the bat, all heart with the celebration! 🫶
An outrageous 3️⃣6️⃣-ball HUNDRED from Vaibhav Sooryavanshi 👏
Updates ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @rajasthanroyals pic.twitter.com/P8Hu3eMFcG
— IndianPremierLeague (@IPL) April 25, 2026
మెరుపు హాఫ్ సెంచరీతో రాజస్థాన్ భారీ స్కోర్‌కు పునాది వేసిన వైభవ్, జురెల్ జోడీని నితీశ్ రెడ్డి విడదీశాడు. జురెల్ ఔటైనా జోరు తగ్గించకుండా మరో 21 బంతుల్లో సెంచరీ అందుకున్నాడీ హిట్టర్. షకీబ్ హుస్సేన్ ఓవర్లో 6, 4 ,6తో ఐపీఎల్లో రెండో శతకం తన పేరటి రాసుకున్నాడీ కుర్ర సంచలనం. అతడి ఊపు చూస్తే క్రిస్ గేల్ రికార్డు (175 రన్స్) అధిగమిస్తాడా అనిపించింది. కానీ, సెంచరీ తర్వాతి బంతికే స్కూప్ షాట్ ఆడబోయి ఎల్బీగా ఔటయ్యాడు.
వైభవ్ వికెట్ దక్కడంతో సన్‌రైజర్స్ బౌలర్లు ‘హమ్మయ్య బతికిపోయాం’ అని ఊపిరి పీల్చుకున్నారు. రియాన్ పరాగ్‌ను కమిన్స్ బౌల్డ్ చేయగా.. సిక్సర్లతో విరుచుకుపడిన డొనొవాన్ ఫెరీరా(33)ను ఫుల్‌టాస్‌తో మలింగ బోల్తా కొట్టించాడు. ఆఖరి ఓవర్లో ప్రఫుల్ పది రన్స్ ఇచ్చి వికెట్ తీయడంతో 230-240 కొడుతుందనుకున్న రాజస్థాన్ 228కే పరిమితమైంది.