ఢిల్లీ: రెండ్రోజుల పాటు ఢిల్లీ వేదికగా జరిగిన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలంలో సుమారు 250 మంది ఆటగాళ్లు పేర్లు నమోదుచేసుకోగా భారత సారథి హర్మన్‌ప్రీత్ సింగ్ రూ. 78 లక్షల (సూర్మా హాకీ క్లబ్)తో అత్యధిక ధర దక్కించుకున్నాడు. అభిషేక్ నాయిన్ (రూ. 72 లక్షలు, శార్చి రార్ బెంగాల్ టైగర్స్), హార్దిక్ సింగ్ (రూ. 70 లక్షలు, యూపీ రుద్రాస్), గొంజలొ పీలట్ (రూ. 68 లక్షలు, హైదరాబాద్ టైటాన్స్), జిప్ జనాస్సెన్ (రూ. 54 లక్షలు, తమిళనాడు గ్రాడన్స్)లు టాప్-5లో నిలిచారు. విదేశీ ఆటగాళ్లలో గొంజలొకే అత్యధిక ధర దక్కింది. మహిళల విషయానికొస్తే భారత డిఫెండర్ ఉదితా దుహన్ (రూ. 32 లక్షలు, బెంగాల్ టైగర్స్) అత్యధిక ధర దక్కించుకుంది.
కమ్రాన్ శతకం
ముల్తాన్: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ (224 బంతుల్లో 118, 11 ఫోర్లు, 1 సిక్స్) అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో గులామ్‌తో పాటు ఓపెనర్ సయీమ్ అయూబ్ (77) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.