Ashes Series : సుదీర్ఘ ఫార్మాట్ అంటే ఐదు రోజులు రంజుగా సాగే ఆట. కానీ, యాషెస్ సిరీస్ (Ashes Series)లో మాత్రం రెండు టెస్టులు రోజుల్లోనే ముగిశాయి. ఇంకేముంది.. ఇరుజట్ల ఆటగాళ్ల ప్రదర్శన కంటే పిచ్‌పైనే రచ్చ జరుగుతోంది. పెర్త్ టెస్టులో తొలిరోజే 19 వికెట్లు పడడంతో అందరూ పిచ్‌ను నిందించారు. మెల్‌బోర్న్‌లోనూ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బౌలర్లు పోటాపోటీగా చెలరేగగా.. రెండు రోజుల్లోనే 36 వికెట్లు నేలకూలాయి. ఫలితంగా కంగారూ టీమ్ ఓటమిపాలైంది. అంతే.. కోపంతో ఊగిపోయిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steven Smith) ఇదేమీ పిచ్ అని క్యూరేటర్పై మండిపడ్డాడు.
యాషెస్ సిరీస్‌లో ఐదు రోజుల క్రీడా వినోదం కాస్త రెండు రోజులకే పరిమితమవుతోంది. పెర్త్ టెస్టులో, తాజాగా మెల్‌బోర్న్‌లోనూ అదే పరిస్థితి. రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ స్టీవ్ స్మిత్ పిచ్‌ను నిందించాడు. ‘మెల్బోర్న్ పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉంది. ఏ బ్యాటర్ కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడడమనేది చాలా ఎక్కువ. క్యూరేటర్స్ ఊహించనదానికంటే అధికంగా పిచ్ స్పందించింది.
🗣️ “They got off to a bit of a flyer”
Steve Smith reflects on Australia’s Ashes Test match loss to England pic.twitter.com/24QRkwoeBE
— Sky Sports News (@SkySportsNews) December 27, 2025
ఒకవేళ మేము పిచ్‌మీద పచ్చికను 8 మిల్లీ మీటర్లు తొలగించి ఉంటే బాగుండేదేమో’ అని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో స్మిత్ వెల్లడించాడు. అంతేకాదు రెండు ఇన్నింగ్స్‌ల్లో అదనంగా 50-60 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ కాపాడుకునేవాళ్లమని ఆతిథ్య జట్టు సారథి తెలిపాడు. తాము నిర్దేశించిన175 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ దూకుడుగా ఆడిన తీరును స్మిత్ ప్రశంసించాడు.
పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్‌లో ఓటములతో సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ తప్పించుకుంది. తుది జట్టులో మార్పులతో ఆడిన పర్యాటక జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో బోణీ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో జోష్ టంగ్(5-45) విజృంభణతో ఆసీస్‌ను 152కే ఆలౌట్ చేసింది ఇంగ్లండ్. ఆ తర్వాత మైఖేల్ నెసర్(4-45) ధాటికి స్టోక్స్ సేన 100కే కుప్పకూలింది. అనంతరం బ్రైడన్ కార్సే(4-34), టంగ్ చెలరేగగా ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 132కే ముగిసింది.
After 5,468 days and 18 winless attempts, this moment with the Barmy Army in Australia was a long time coming for England
(📹 available to view in India only) pic.twitter.com/Xc3NBNvCvB
— ESPNcricinfo (@ESPNcricinfo) December 27, 2025
స్వల్ప ఛేదనలో జాకబ్ బెథెల్(40) బ్యాటుతో రాణించగా కంగారూ జట్టు వైట్‌వాష్ కలను కల్లలు చేసింది బెన్ స్టోక్స్ బృందం. బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్‌కు షాకిచ్చిన ఇంగ్లండ్ 14 ఏళ్ల తర్వాత వారి నేలపై తొలి విజయం నమోదు చేసింది. చివరిదైన ఐదో టెస్టు జనవరి 4న సిడ్నీలో మొదలవ్వనుంది.