గాలె : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా అదరగొడుతున్నది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(120 నాటౌట్), అలెక్స్ క్యారీ(139 నాటౌట్) సెంచరీలతో విజృంభించడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 330-3 స్కోరు చేసింది. ఖవాజ(36), హెడ్(21), లబుషేన్(4) నిరాశపరిచారు. మూడు కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో స్మిత్, క్యారీ నాలుగో వికెట్‌కు 239 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 229-9 శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన లంక 257 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్(85నాటౌట్) ఆకట్టుకున్నాడు. స్టార్క్, కున్హెమన్, లియాన్ మూడేసి వికెట్లు పడగొట్టారు.