షార్జా: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంకకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు కుశాల్ పెరీరా (7), పాథుమ్ నిస్సంక (12 నాటౌట్) శుభారంభం అందించడానికి ప్రయత్నించారు. కానీ ఈ క్రమంలో నాలుగో ఓవర్లో ఆన్రిచ్ నార్ట్జీ వేసిన బంతికి పెరీరా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
బంతిని అంచనా వేయడంలో పొరపడిన అతను తన వికెట్‌ను మూల్యంగా చెల్లించుకున్నాడు. గ్రూప్-1కు చెందిన సౌతాఫ్రికా, శ్రీలంక రెండు జట్లు కూడా రెండేసి మ్యాచ్‌లు ఆడి ఒక్కో విజయాన్ని నమోదు చేసి ఉన్నాయి. దీంతో సెమీస్‌కు వెళ్లాలంటే మిగతా మ్యాచులన్నీ గెలవాల్సిన పరిస్థితిలో రెండు జట్లూ ఉన్నాయి.