షార్జా: దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ లైనప్ వణికిపోయింది. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లే పెవిలియన్ చేరుతున్న వేళ ఓపెనర్ పాథుమ్ నిస్సంక (72) జట్టును ఆదుకున్నాడు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో పాతుకుపోయాడు.
అతని పోరాటంతో 20 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక జట్టు 142 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లంక ఆటగాళ్లలో కుశాల్ పెరీరా (7), అసలంక (21), రాజపక్స (0), అవిష్క ఫెర్నాండో (3), వానిందు హసరంగ (4), దాసున్ షానక (11), చమిక కరుణరత్నే (5), చమీరా (3), తీక్షణ (7) పరుగులు చేశారు.
ఇన్నింగ్స్ చివరి బంతికి లాహిరు కుమార (0) రనౌట్ అయ్యాడు. సౌతాఫ్రికా బౌలర్లలో షంసీ, ప్రిటోరియస్ చెరి మూడు వికెట్లు పడగొట్టగా, నార్ట్జీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.