షార్జా: శ్రీలంకతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ గ్రూప్-1 మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ చెమటోడుస్తున్నారు. 143 పరుగులు లక్ష్యఛేదనలో క్వింటన్ డికాక్ (12), రీజా హెండ్రిక్స్ (11) మంచి ఆరంభమే ఇచ్చారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వీరిద్దరినీ పెవిలియన్ చేర్చిన దుష్మంత చమీరా లంక జట్టుకు బ్రేక్ ఇచ్చాడు.
ఇద్దరు ఓపెనర్ల వికెట్లనూ ఒకే ఓవర్లో కోల్పోవడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ వ్యాన్ డర్ డస్సెన్ (12 నాటౌట్), కెప్టెన్ టెంబా బవుమా (3 నాటౌట్) భారీ షాట్లకు ప్రయత్నించడం లేదు. ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతున్నారు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు 40 పరుగులు చేసింది.