న్యూయార్క్: అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఆడితే లోకమే ఆడదా అన్నట్లు మెస్సీ ఆటకు మైమరిచిపోని అభిమాని లేడు. గతేడాది ఖతార్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ ధరించిన జెర్సీలకు కండ్లు చెదిరే ధర పలికింది. ప్రముఖ వేలం సంస్థ సౌత్‌బే మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను వేలం వేయగా ఏకంగా రూ.64.75 కోట్ల ధర పలికాయి. ఈ ఏడాది స్పోర్ట్స్ పరంగా అత్యధిక ధర లభించనవి ఇవేనని సౌత్‌బే ఒక ప్రకటనలో పేర్కొంది.