కొత్తపల్లి, మే 9 : డెహ్రాడూన్(ఉత్తరాఖండ్) వేదికగా జరుగుతున్న ఏషియన్ జూనియర్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో తెలంగాణకు చెందిన తుడి సిరిచందన కాంస్య పతకంతో సత్తాచాటింది. శుక్రవారం జరిగిన మహిళల 52కిలోల విభాగంలో బరిలోకి దిగిన సిరిచందన 330కిలోల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది.
కరీంనగర్ జిల్లాకు చెందిన సిరిచందన అద్భుత ప్రదర్శతో కాంస్య పతకం సొంతం చేసుకున్నట్లు ఆమె కోచ్ మల్లేశం శుక్రవారం పేర్కొన్నాడు.