అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో.. భారత బౌలర్ సిరాజ్( Mohammed Siraj) తన సహనాన్ని కోల్పోయాడు. కోపంతో అతను బౌలింగ్ వేసే సమయంలో బంతిని వికెట్ల మీదకు విసిరేశాడు. ఈ ఘటన ఆస్ట్రేలియా 25వ ఇన్నింగ్స్‌లో చోటుచేసుకున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా .. ధీటుగా ఆడుతోంది. లబుషేన్, మెక్స్వీనేలు.. ఇండియన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అయితే 25వ ఓవర్‌ను సిరాజ్ వేశాడు. ఆ ఓవర్లో అయిదో బంతికి.. బ్యాటింగ్ చేస్తున్న లబుషేన్ అడ్డుకున్నాడు.
Labuschagne humbling MDC Siraj 😆💉pic.twitter.com/jeTSlrIXkB
— . (@Devx_07) December 6, 2024
సిరాజ్ రన్నప్ తీసుకున్న తర్వాత.. బ్యాటింగ్ క్రీజ్ నుంచి లబుషేన్ పక్కకు జరిగాడు. అయితే అదే రనప్‌తో వచ్చిన సిరాజ్ తన చేతుల్లోని బంతిని వికెట్ల మీదకు కోపంతో విసిరేశాడు. సైట్ స్క్రీన్ వద్ద ఓ ప్రేక్షకుడు కదలడం వల్ల లబుషేన్ క్రీజ్ నుంచి పక్కకు జరిగాడు. కానీ ఇది తెలుసుకోకుండానే సిరాజ్ తన టెంపర్‌ను కోల్పోయాడు.
తాజా సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 84 రన్స్ చేసింది. మెక్‌స్వీనే 32, లబుషేన్ 17 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.