ఓవల్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదో టెస్టు ఉత్కంఠ రేపుతోంది. ఆఖరి రోజు 35 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండ్లండ్కు సిరాజ్ షాకిచ్చాడు. రెండు వికెట్లను తీశాడతను. జేమీ స్మిత్, ఓవర్టన్ను ఔట్ చేశాడు. గెలుపు కోసం ఇండియా మరో రెండు వికెట్లు తీయాలి. ఒకవేళ ఇంగ్లండ్ గెలవాలంటే మరో 20 రన్స్ చేయాల్సి ఉంది. వాస్తవానికి ఓవల్ పిచ్‌లో ఉదయం వర్షం కురిసింది. చినుకులు కురుస్తున్నా క్రికెటర్లు ఆడారు. కొన్ని ఓవర్ల తర్వాత స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు ఆన్ చేశారు.ఈ మ్యాచ్‌లో ఇప్పటికే సిరాజ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. 374 టార్గెట్‌తో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సిరీస్‌లో 2-1 తేడాతో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది.