WTC Final IND vs AUS : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి ఖవాజా డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో, రెండు పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ పడింది. భరత్ క్యాచ్ పట్టిన అనంతరం సిరాజ్‌తో సహా భారత ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. వరల్డ్ నంబర్ 1 టెస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్ వచ్చాడు. డేవిడ్ వార్నర్(2) క్రీజులో ఉన్నాడు.
Mohammed Siraj breaks through early for India 💥
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/27XCmePGAI
— ICC (@ICC) June 7, 2023