హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాబోయే రంజీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టుకు టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్ సీవీ మిలింద్ వైస్ కెప్టెన్సీగా వ్యవహరిస్తాడని హెచ్‌సీఏ సీనియర్ సెలెక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.
భారత జట్టు బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని సిరాజ్ అందుబాటులో లేని సమయంలో మిలింద్ కెప్టెన్‌గా హైదరాబాద్ టీమ్‌ను నడిపిస్తాడని పేర్కొంది.