మసొన్: టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), ఇగా స్వియాటెక్ (పోలండ్) సిన్సినాటి ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరారు. పారిస్ ఒలింపిక్స్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం నెగ్గిన స్వియాటెక్ మహిళల సింగిల్స్ విభాగంలో 6-0, 6-7 (8/10), 6-2తో వర్వర గ్రచెవ (రష్యా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ఒకటో సీడ్ సిన్నర్ 6-4, 7-5తో అలెక్స్ మైకెల్సెన్ (యూఎస్ఏ)ను వరుస సెట్లలో ఓడించి ప్రిక్వార్టర్స్ చేరాడు.
సచిన్ @ 2.15 కోట్లు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో 11వ సీజన్ కోసం గురువారం వేలంపాట హాట్‌హాట్‌గా సాగింది. తొలి రోజు వేలంలో యువ రైడర్ సచిన్ తన్వర్‌ను తమిళ్ తలైవాస్ రూ.2.15 కోట్లకు తీసుకుంది. సచిన్‌తో పాటు ఇరాన్‌కు చెందిన ఆల్‌రౌండర్ మహమ్మద్ రెజా షౌద్లీని హర్యానా స్టీలర్స్ రూ.2.07కోట్లకు కొనుగోలు చేసింది. స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్‌ను తెలుగు టైటాన్స్ తిరిగి రూ.1.72కోట్లకు అట్టిపెట్టుకుంది. మొత్తంగా తొలి రోజు ఎనిమిది మంది భారత ప్లేయర్లు వేలంలో కోటి రూపాయాలకు పైగా పలుకడం విశేషం. వేలంలో భారీ ధర రావడం పీకేఎల్‌కు పెరుగుతున్న ఆదరణ అని సచిన్ తన్వర్ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా 97/9
గయానా: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బౌలర్లు అదరగొట్టారు. యువ పేసర్ షమర్ జోసెఫ్, జేడన్ సీల్స్ రాణించడంతో 37 ఓవర్ల ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జోసెఫ్ 5 వికెట్లతో విజృంభించగా సీల్స్ 3 వికెట్లు పడగొట్టాడు. సఫారీ బ్యాటర్లలో బెడింగ్హమ్ (28), ట్రిస్టన్ స్టబ్స్ (26), కైల్ (21), మార్క్మ్(్ర14) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. నలుగురు డకౌట్ కాగా ఇద్దరు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.