Cincinnati Open : పురుషుల టెన్నిస్‌ను ఏలుతున్న కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz), జన్నిక్ సిన్నర్(Jannik Sinner)లు మరో పోరుకు సిద్దమవుతున్నారు. ఈమధ్యే వింబుల్డన్ ఫైనల్లో హోరాహోరీగా తలపడిన ఇరువురు ఇప్పడు సిన్సినాటి ఓపెన్ (Cincinnati Open) ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నారు. సిన్నర్, అల్కరాజ్ టైటిల్ పోరులో తలపడడం ఇది ఐదోసారి. ఈ ఏడాది ఇద్దరికి ఇది నాలుగో ఫైనల్ కావడం విశేషం.
ఇటాలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో ఓ నువ్వానేనా అన్నట్టు ఢీకొన్న ఈ యువకెరటాలు ఇప్పుడు మరో రసవత్తర పోరాటంతో అభిమానులను అలరించనున్నారు. సోమవారం ఆగస్టు 18న ఫైనల్ సిన్సినాటి ఫైనల్ జరుగనుంది. ఈమధ్య మూడు ఫైనల్లో సిన్నర్, అల్కరాజ్ ఎదురుపడ్డారు. ఇందులో స్పెయిన్ బుల్ రెండు విజయాలతో ఇటలీ కెరటంపై పైచేయి సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సిన్నర్‌కు షాకిచ్చి అల్కరాజ్ ఛాంపియన్‌గా నిలిచాడు.
Sinner vs Alcaraz 2025, Chapter IV 📖
Three finals this season — Who takes the 4th in Cincinnati 🇪🇸🇪🇸🇮🇹❓#CIncyTennis pic.twitter.com/AHAM6tv3Bd
— Roland-Garros (@rolandgarros) August 17, 2025
అయితే.. వింబుల్డన్ ఫైనల్లో ఐదు గంటలు కొదమసింహాల్లా పోరాడారిద్దరూ. చివరకు సిన్నర్ విజేతగా అవతరించాడు. ఏటీపీ మాస్టర్స్ కలిపితే ఓవరాల్‌గా 13 మ్యాచుల్లో 8-5తో అల్కరాజ్ ఆధిపత్యం చెలాయించాడు. అలా అనీ టాప్ సీడ్ సిన్నర్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇద్దరూ తేలికగా ఓటమికి తలొగ్గే రకం కాదు. దాంతో, సిన్సినాటి ఓపెన్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.