CSK vs RR : ప్లే ఆఫ్స్ బెర్తుకు అడుగు దూరంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కష్టాల్లో పడింది. చెపాక్ స్టేడియంలో సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో వంద లోపే మూడు వికెట్లు కోల్పోయింది. సిమర్జిత్ సింగ్ మరోసారి విజృంభించడంతో కెప్టెన్ సంజూ శాంసన్(15) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. ప్రస్తుతం రియాన్ పరాగ్(29), ధ్రువ్ జురెల్(3)లు జట్టుకు భారీ స్కోర్ అందించే పనిలో ఉన్నారు. 15 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 94/3 .
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్థాన్‌కు శుభారంభం దక్కినా సద్వినియోగం చేసుకోలేదు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(24), జోస్ బట్లర్(21)లు తొలి వికెట్‌కు 43 రన్స్ జోడించారు. అయితే.. ఈ ప్రమాదకర జోడీని సిమర్జిత్ విడదీశాడు. అక్కడితో మొదలు రాజస్థాన్ వికెట్ల పతనం మొదలైంది.