CSK vs RR : ఐపీఎల్ పదిహేడో సీజన్లో(IPL2024) ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) విజృంభిస్తున్నది. టాస్ ఓడి బౌలింగ్ దిగిన సీఎస్కే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఆర్ఆర్ను కట్టడి చేస్తున్నది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేసి పరుగులను కట్టడి చేసింది.
యశస్వి జైస్వాల్(24) సీమర్ జీత్(simarjeet) బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా మరో విధ్వంసకర ఓపెనర్ జోస్ బట్లర్‌ను(21) సీమర్ జీత్ సింగ్ ఔట్ చేశాడు. ఫైన్‌లెగ్‌లో ఉన్న తుషార్ పాండే అద్భుతమైన క్యాచ్‌తో బట్లర్(Jos Buttler) పెవిలియన్ బాటపట్టాడు. దీంతో ఆర్ఆర్ 8.1 ఓవర్లలో 49 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సంజు శాసన్(6), రియాన్ పరాగ్ (0) ఉన్నారు. ఆర్ఆర్ స్కోరు 49 /2 (8.1ఓవర్లు).