లాహోర్: జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రాజా(Sikandar Raza) స్టన్నింగ్ ఆటను ప్రదర్శించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ క్వలాండర్స్ జట్టు తరపున అతను వీరవిహారం చేశాడు. కేవలం 7 బంతుల్లో 22 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వాస్తవానికి పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం టాస్ వేయడానికి 10 నిమిషాల ముందే అతను లాహోర్ స్టేడియం చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆడిన సికందర్ రాజా ఆగమేఘాల మీద లాహోర్ చేరుకున్నాడు. బర్మింగ్‌హామ్ నుంచి విమానంలో వచ్చిన అతను.. లాహోర్ జట్టుకు టైటిల్ అందించాడు.
ఆదివారం పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. ఆ జట్టులో నవాజ్ 76 రన్స్ చేశాడు. ఆ తర్వాత భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లాహోర్ జట్టుకు మరో బంతి మిగిలి ఉండగా విజయాన్ని అందుకున్నది. లాహోర్ టీమ్‌లో పెరీరా 62, నహీమ్ 46, షఫీక్ 41, రాజా 22 రన్స్ చేశారు. ఆరు వికెట్ల తేడాతో లాహోర్ గెలిచింది.
ఈ మ్యాచ్‌లో సికందర్ రాజా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. 24 గంటల క్రితం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఆడిన రాజా ఆ మ్యాచ్‌లో 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత 20 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే ఓటమి పాలైంది. కానీ లాహోర్‌లో జరుగుతున్న పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్‌కు అతను హాజరయ్యేందుకు కష్టపడ్డాడు. బర్మింగ్‌హామ్ నుంచి విమానంలో అతను దుబాయ్ మీదుగా లాహోర్‌కు చేరుకున్నాడు. బర్మింగ్‌హామ్‌లో డిన్నర్ చేశాడని, దుబాయ్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేశాడని, అబుదాబిలో లంచ్ చేశాడని, మళ్లీ పాకిస్థాన్‌లో డిన్నర్ చేసినట్లు చెబుతున్నారు.
3 ఓవర్లలో 47 రన్స్ అవసరమైన దశలో బ్యాటింగ్‌కు దిగిన సికందర్ రాజా బ్రేవ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చివరకు 3 బంతుల్లో 8 రన్స్ అవసరమైన టైంలో రెండు బౌండరీలు కొట్టి జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. దీంతో లాహోర్ మూడోసారి టైటిల్ చేజిక్కించుకున్నది.
SIKANDAR RAZA BATTING FIGURE AGAINST QUETTA GLADIATORS
Runs: 22 not out
Balls: 7
Fours: 2
Sixes: 2
Strike rate: 314.29
pic.twitter.com/rrbAohAcvr— Sir Haris Rauf 154.7 (@H_RaufAcademy) May 25, 2025