Navjyoth Sidhu : ఛాంపియన్స్ ట్రోఫీ (Champions trophy) లో వికెట్ కీపర్ (Wicket Keeper) గా, బ్యాటర్‌గా రాణిస్తూ కేఎల్ రాహుల్ (KL Rahul) భారత్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ బ్యాటర్, కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjyoth Singh Sidhu) ప్రశంసలు కురిపించాడు. వివిధ స్థానాలకు అనుగుణంగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవడం అతడికే చెల్లిందన్నాడు. రాహుల్ చాలాకాలంగా జట్టుకు తన సేవలు అందిస్తున్నా ఇప్పటికీ సుస్థిర స్థానం దక్కకపోవడం దారుణమని వ్యాఖ్యానించాడు.
కేఎల్ రాహుల్‌ను స్పేర్ టైర్ కంటే ఎక్కువగా వాడేస్తున్నారని సిద్ధూ కామెంట్ చేశాడు. రాహుల్‌ను వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాలంటారని, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దింపుతారని, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వస్తే మూడో నెంబర్లో ఆడాలంటారని, ఒక్కోసారి ఓపెనర్‌గానూ దిగాలని ఆదేశిస్తారని అన్నాడు. ఇన్ని స్థానాల్లో ఆడుతూ నిస్వార్థంగా రాహుల్ జట్టుకు సేవలందిస్తున్నాడని సిద్ధూ కొనియాడారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు రెండు రోజుల ముందు సిద్ధూ ఇలాంటి కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది. భారత్, న్యూజిలాండ్ జట్ట మధ్య ఈ నెల 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ట్రోఫీ గెలువడమే లక్ష్యంగా రెండు జట్లు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.