Shubman Gill | దక్షిణాఫ్రికాతో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు. లక్నోలో బుధవారం జరగాల్సిన మ్యాచ్ భారీ పొగమంచు కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. శుక్రవారం జరగాల్సిన మ్యాచ్ నుంచి సైతం గిల్ తప్పుకున్నాడు. సిరీస్ మధ్యలోనే టెస్ట్-వన్డే కెప్టెన్ తప్పుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. గిల్ ప్రాక్టీస్ సమయంలో గాయపడినట్లుగా సమాచారం. నిజంగా గిల్ గాయపడ్డాడా? లేకపోతే జట్టు నుంచి తప్పించారా? అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు సందేహాలు లేవెత్తుతున్నారు.
కోల్‌కతా టెస్ట్ సమయంలో శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. మెడ గాయం కారణంగా గిల్‌ను కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లోకు సైతం గిల్ దూరమయ్యాడు. టీ20 సిరీస్‌కు ముందు గిల్ ఫిట్‌గా ఉన్నట్లుగా సర్టిఫికెట్ ఇవ్వడంతో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడంతో టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. తాజాగా గాయం కారణంగా టీ20 సిరీస్ కారణంగా మళ్లీ జట్టు నుంచి తప్పుకున్నాడన్న వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. పలువురు అభిమానులు జట్టు నుంచి తప్పించడంపై సెటైరికల్‌గా స్పందించారు. జట్టు నుంచి తొలగించారా? లేదంటే నిజంగా గాయపడ్డాడా? అంటూ ప్రశ్నించారు.
పలువురు అభిమానులు స్పందిస్తూ.. ఇందులో అర్థం చేసుకోకపోవడానికి రాకెట్ సైన్స్ ఏమీ లేదని.. మ్యాచ్‌లో గిల్‌ను తప్పించారని ఓ అభిమాని ఆరోపించాడు. మళ్లీ జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ సంజు శాంసన్ లాంటి ఆటగాళ్లు ఇప్పటికీ అవకాశాల కంటే అదృష్టంపైనే ఆధారపడడం విచారకరమని.. అతను స్టాండ్స్‌కే పరిమితమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గిల్ గాయపడడంతో చివరకు అతనికి అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్లేయర్లు గాయాలు, పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా కాకుండా నిజంగా అవకాశాలు దక్కాలని ఆకాంక్షించాడు. అయితే, బీసీసీఐ గిల్ గాయం, ఫిట్‌నెస్‌పై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
వాస్తవానికి గిల్, పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20ల్లో బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోయాడు. భారత జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యాడు. గిల్ వన్డేలు, టెస్టుల్లో రాణించగా.. టీ20 మ్యాచుల్లో మాత్రం పరుగులు చేయలేక ఇబ్బందిపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచుల్లో కలిసి కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి మ్యాచ్‌లో 4, రెండో మ్యాచ్‌లో డకౌట్, మూడో మ్యాచ్‌లో కేవలం 28 పరుగులు చేశాడు. సిరీస్‌లో సగటు 10.66 కాగా.. స్ట్రయిక్ రేట్ 103.22గా ఉంది. నాలుగో మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయ్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే పొగమంచు కారణంగా రద్దయ్యింది. ప్రస్తుతం భారత్ ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో జరుగనున్నది.