ICC : ఇంగ్లండ్ పర్యటనలో దంచికొట్టిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్‌గా తొలి ఐసీసీ అవార్డు అందుకున్నాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో సారథిగా జట్టును ముందుండి నడిపించిన గిల్.. ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (Player Of The Month)గా ఎంపికయ్యాడు. జూలై నెలకుగానూ అతడు ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.
ఇంగ్లండ్ గడ్డపై పరుగలు వరద పారించిన అతడు ఆ జట్టు నాయకుడు బెన్ స్టోక్స్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ మల్డర్ కంటే అత్యధిక ఓట్లతో విజేతగా నిలిచాడు. విశేషం ఏంటంటే.. గిల ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుపొందం ఇది నాలుగోసారి. పురుషుల క్రికెట్లో మరెవరూ ఇన్నిసార్లు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకోలేదు.
He set the stage on fire with his batting heroics in his first series as #TeamIndia‘s Test captain in England! 🔝
Congratulations to Shubman Gill as he becomes the ICC Men’s Player of the Month for July 2025. 👏 👏
He wins this honour for the record 4⃣th time! 🙌@ShubmanGill pic.twitter.com/Ju470YqqCG
— BCCI (@BCCI) August 12, 2025
‘జూలై నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికవ్వడం గొప్పగా అనిపిస్తోంది. టెస్టు కెప్టెన్‌గా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసినందుకు ఈ అవార్డు రావడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో బర్మింగ్హమ్లో సాధించిన ద్విశతకాన్ని నేను కలకాలం గుర్తించుకుంటాను’ అని గిల్ వెల్లడించాడు. సీనియర్ల గైర్హాజరీలో టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న గిల్ తొలి సిరీస్‌లోనూ తన తడాఖా చూపించాడు. ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలతో కలిపి 754 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుపొందాడీ స్టార్ ప్లేయర్.
గత రెండేళ్ల నుంచి భీకర ఫామ్‌లో ఉన్న గిల్.. తొలిసారి 2023 జనవరిలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలిచాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లోనూ తన బ్యాట్ పవర్ చూపించిన ఈ యువకెరటం మరోసారి విజేతగా నిలిచాడు. 2025 ఫిబ్రవరిలోనూ నామినేట్ అయిన గిల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు తన్నుకుపోయాడు. తొలి మూడు పర్యాయాలు పరిమిత ఓవర్ల క్రికెట్లో విజేతగా అవతరించిన ఈ డాషింగ్ బ్యాటర్.. ఈసారి టెస్టు క్రికెట్లోనూ తనకు తిరుగులేదని చాటాడు.
🚨 𝑯𝑰𝑺𝑻𝑶𝑹𝒀 🚨
Shubman Gill becomes the first-ever player to win four ICC Player of the Month awards in men’s cricket! 🇮🇳🎖️#India #ShubmanGill #ICC #Sportskeeda pic.twitter.com/RurIawzH8L
— Sportskeeda (@Sportskeeda) August 12, 2025