Shubman Gill : టెస్టు సారథిగా తొలి సిరీస్‌లోనే తన ముద్ర వేసిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) బ్యాటర్‌గానూ గొప్పగా రాణించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లకు కౌంటర్ ఇవ్వడంతో పాటు.. తన కూల్ కెప్టెన్సీతో తగిన నాయకుడు దొరికాడనే ప్రశంసలు అందుకున్నాడు. అండర్సన్ -టెండూల్కర్ ట్రోఫీలో సూపర్ ఫామ్‌తో చెలరేగిన గిల్ దేశవాళీ క్రికెట్లో దంచేస్తాడని అనుకున్నారంతా. దులీప్ ట్రోఫీ (Duleep Trophy)లో కెప్టెన్‌గా తమ జట్టును టీమిండియా ప్రిన్స్ అలవోకగా గెలిపిస్తాడనుకుంది నార్త్ జోన్ (North Zone). కానీ. ఈ స్టార్ ప్లేయర్ అనారోగ్యం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు.
దేశవాళీ క్రికెట్ 2025-26 సీజన్లో మొదటిదైన దులీప్ ట్రోఫీ ఆగస్టు 28న మొదలవ్వనుంది. జోన్ల ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నీలో నార్త్ జోన్ జట్టు శుభ్‌మన్ గిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇంగ్లండ్‌లో ఇరగదీసిన అతడికి కెప్టెన్సీ కట్టబెట్టి.. పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. కానీ, తీరా టోర్నీకి ఐదు రోజుల ముందు గిల్ అనారోగ్యానికి గురయ్యాడు. ఫిజయోథెరపిస్ట్లు అతడిని పరీక్షించి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో.. సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్(Asia Cup 2025)లోపు కోలుకొని, ఫిట్నెస్ సాధించాలనుకుంటున్నాడు భారత సారథి.
🚨 Shubman Gill likely to miss #DuleepTrophy after a bout of illness
The Indian skipper is currently resting at his home in Chandigarh pic.twitter.com/uMbKdexF7Z
— Cricbuzz (@cricbuzz) August 23, 2025
ప్రస్తుతం ఛండీగఢ్‌లోని తన ఇంట్లో సేద తీరుతున్న గిల్ తన ఆరోగ్యం మెరుగయ్యాక నెట్స్‌లో ప్రాక్టీస్ షురూ చేయనున్నాడు. దులీప్ ట్రోఫీకి శుభ్‌మన్ గిల్ దూరమైనందున వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అంకిత్ కుమార్ నార్త్ జోన్ జట్టును నడిపించే అవకాశముంది. ఆసియా కప్ స్క్వాడ్‌లోని పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానాలు కూడా ఒకే ఒక మ్యాచ్ ఆడనున్నారు. యూఏఈకి వెళ్లడానికి ముందు ఇద్దరూ ఈస్ట్ జోన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగుతారు.
నార్త్ జోన్ స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), శుభం ఖజురియా, అంకిత్ కుమార్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదొని, యశ్ దయాల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ లొత్రా, మయాంక్ దగర్, యధ్వీర్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, అన్షుల్ కంభోజ్, అఖీబ్ నబీ, కన్హయ్య వధావన్ (వికెట్ కీపర్).
రీప్లేస్మెంట్స్ : ఒకవేళ గిల్, అర్ష్‌దీప్, హర్షిత్‌లు ఆసియాకప్ స్క్వాడ్‌కు ఎంపికైతే వీళ్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురిని ఎంపిక చేశారు సెలెక్టర్లు. శుభం రొహిల్లా (గిల్), గుర్నూర్ (అర్ష్‌దీప్ సింగ్), అనుజ్ థక్రాల్ (హర్షిత్ రానా).