Eden Gardens : సొంతగడ్డపై భారత జట్టుకు ఈసారి దక్షిణాఫ్రికా రూపంలో పరీక్ష ఎదురవుతోంది. ఇటీవలే వెస్టిండీస్ (West Indies)ను వైట్‌వాష్ చేసిన టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) విజేతలైన సఫారీలను నిలువరించేందుకు పక్కాగా సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా పర్యటన ముగియడంతో స్వదేశం చేరుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shumban Gill) సేన బ్యాటుతో చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. తొలి టెస్టుకు ఇంకా రెండు రోజులే ఉండడంతో.. మంగళవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను కోచ్ గంభీర్‌తో కలిసి గిల్ పరిశీలించాడు.
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో క్లీన్‌స్వీప్ తర్వాత మళ్లీ విజయాల బాట పట్టింది టీమిండియా. డబ్ల్యూటీసీ తొలి పోరులో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమం చేసిన శుభ్‌మన్ గిల్ బృందం.. వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు టీమిండియాకు సవాల్ విసిరేందుకు దక్షిణాఫ్రికా కాచుకొని ఉంది.
📸 Indian Men’s Cricket team players Shubman Gill, Sai Sudharsan, Yashasvi Jaiswal and Nitish Kumar Reddy along with coach Gautam Gambhir and other staff members practiced at Eden Gardens ahead of the India vs South Africa, 1st Test in Kolkata. pic.twitter.com/6G19S8F43G
— Sportz Point (@sportz_point) November 11, 2025
తెంబా బవుమా నేతృత్వంలోని పటిష్టమైన సఫారీల జట్టుకు చెక్ పెట్టాలంటే కాస్త కష్టపడాల్సిందే. అందుకే.. ఆస్ట్రేలియా పర్యటనలో పెద్దగా రాణించని గిల్ తనకు కలిసొచ్చిన సుదీర్ఘ ఫార్మాట్లో భారీ స్కోర్లు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. సహచరుల కంటే ముందే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో చెమటోడ్చాడు భారత సారథి. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ కాసేపు బ్యాటింగ్ సాధన చేశాడు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా, సుందర్ సైతం బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు.
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య నవంబర్ 14న ఈడెన్ గార్డెన్స్‌లో ఉదయం 9:30 గంటలకు తొలి టెస్టు ప్రారంభం కానుంది. కరోనా తర్వాత ఈడెన్స్‌లో జరుగనున్న తొలి టెస్టు మ్యాచ్ ఇదే. దాంతో.. అభిమానులు భారీగా స్టేడియానికి తరలివచ్చే అవకాశముంది. రెండో దఫా బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు.
Preparations in full swing as 🇮🇳 get ready to take on 🇿🇦 at Eden Gardens on Friday! #INDvsSA #IndianCricket pic.twitter.com/D8G4eVY94U
— Cricbuzz (@cricbuzz) November 11, 2025